ETV Bharat / state

భూమిపూజలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీని అడ్డుకున్న గ్రామస్థులు

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సొంత మండలంలో సచివాలయ భవనాల భూమిపూజ కోసం చేసిన ఏర్పాట్లు ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీకే చెందిన రెండు గ్రామాల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్సీ భూమిపూజ చేయకుండానే వెనుతిరిగారు.

భూమిపూజలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ అడ్డుకున్న గ్రామస్థులు

author img

By

Published : Jul 4, 2020, 5:22 PM IST

కడప జిల్లా కాశి నాయన మండలంలోని రంపాడు గ్రామ పంచాయతీకి ఓబులాపురం గ్రామంలో, నరసాపురం గ్రామ పంచాయతీకి మిద్దెల గ్రామంలో సచివాలయ భవన నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఆహ్వానించారు. ఓబులాపురం గ్రామంలో సచివాలయ భవనం నిర్మించడానికి రంపాడు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆందోళనకు దిగారు. అధికారికంగా మా గ్రామంలో నిర్మించాల్సిన భవనం మరోచోట ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ వస్తున్నారని తెలిసి అడ్డుకోవడానికి అందరూ రోడ్డుపైకి చేరారు. సీఐ మోహన్‌రెడ్డి వారిని అడ్డుకున్నారు. అంతలోనే వాహనంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీకి మాజీ సర్పంచి కర్నాటి శ్వేతశ్రీ సమస్యను వివరించారు. అందరూ అధికార పార్టీ వారే కావడంతో చేసేది ఏమిలేక ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ వెనుదిరిగారు. నరసాపురం గ్రామ వైకాపా నాయకులు భూమిపూజ కోసం తీయించిన గొయ్యిని రంపాడు గ్రామస్థులు పూడ్చివేశారు.

ఇదీ చదవండి : 'కాల్‌ డేటాను పరిశీలించే కొల్లు రవీంద్రను అరెస్టు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.