సీఎం జగన్ ముస్లింల పక్షపాతి అని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేటలో ముస్లింలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైకాపా ప్రభుత్వంలో ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని, ఎల్లప్పుడు వారికి అండగా నిలుస్తామని ఆకేపాటి చెప్పారు.
ఇదీ చదవండి: