కడప జిల్లా బ్రహ్మంగారి మఠాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. బ్రహ్మంగారి జీవసమాధిని దర్శించుకున్న అనంతరం.. పీఠాధిపతి ఎంపికను స్వయంగా పర్యవేక్షించారు. దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మితో, పెద్దభార్య నలుగురు కుమారులతోనూ మంత్రి వెల్లంపల్లి చర్చించారు.
త్వరలోనే నిర్ణయిస్తాం..
'త్వరలో బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిని నిర్ణయిస్తాం. అందరూ ఒకే అభిప్రాయానికి రావాలని పీఠాధిపతి వారసులను కోరాం. కుటుంబసభ్యులంతా మాట్లాడి 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదు. దేవదాయశాఖకు, పీఠాధిపతుల బృందానికి సంబంధం లేదు. పీఠాధిపతి నిర్ణయం తేలకుంటే ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంటుంది' - వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి
ఇదీ చదవండి
Gone Prakash Rao: భాజపా అనుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు