'పాఠశాల్లలో వసతులు చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా ? ఏం చేస్తున్నావ్..' అంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్‌పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప మున్సిపల్ పాఠశాలలో జరుగుతున్న నాడు - నేడు పనులను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాతో కలిసి పరిశీలించిన ఆయన..పాఠశాలలో నెలకొన్న సమస్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం పట్ల మంత్రులు మండిపడ్డారు. ఇంత అధ్వానంగా వసతులుంటే పిల్లలు పాఠశాలకు ఎలా వస్తారని ప్రధానోపాధ్యాయురాలితో పాటు, నిర్వాహకులు, మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు.
నాడు-నేడు కింద పాఠశాలలో ఇప్పటివరకు 39 లక్షలు ఖర్చు చేశామని అధికారులు చెప్పగా...అంత పని ఎక్కడ జరిగిందని అంజాద్ బాషా ప్రశ్నించారు. మెనూ ప్రకారం పిల్లలకు పెడుతున్న భోజనాన్ని రుచి చూసిన మంత్రులు..ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన వసతులు కల్పించాలని, తరచూ పాఠశాలను తనిఖీ చేయాలని కలెక్టర్‌కు మంత్రులు సూచించారు.
ఇదీచదవండి