‘ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి. చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదు. చదువుకోవాలనే తపన విద్యార్థులకు, ప్రోత్సహించాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగి పదిమందికి ఆదర్శంగా నిలవొచ్ఛు’ అని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా స్పష్టం చేశారు. కడప నగరపాలక సంస్థ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఆయన సంయుక్త కలెక్టర్ సాయికాంత్‌వర్మతో కలిసి ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించారు.
పిల్లలు బాగుండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పథకాన్ని ప్రారంభించారని, ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరూ కూడా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సాంకేతికంగా మరింత మెరుగుపరచుకునేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ‘అమ్మఒడి’ నగదు స్థానంలో లాప్‌ట్యాప్‌లు అందిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించారని, ఆ దిశగా ముందుగానే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం సంయుక్త పాలనాధికారి సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే క్రమంలో చక్కటి వాతావరణం ఏర్పాట్లు చేసేందుకు పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సబ్‌కలెక్టర్ పృథ్వీతేజ్, కమిషనర్ లవన్న, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇదీ చదవండి: