కడప జిల్లా ప్రొద్దుటూరులో పాల వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగించే వారిపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యాపారులను.... పాల క్యాన్‌లతో పట్టణాల్లోకి అనుమతించడం లేదని వాపోతున్నారు. కరోనా సోకుతుందనే భయంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పట్టణంలోని ఓ కంపెనికి పోయాలని పురపాలిక అధికారులు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. పట్టణంలో సుమారు 500 మంది వ్యాపారులు గ్రామీణుల నుంచి పాలను సేకరించి పట్టణాల్లో ఇంటిఇంటికీ తిరుగుతూ పాలను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
విడిపాలకు అలవాటు పడిన ప్రజలు ఒక్కసారిగా ప్యాకెట్ పాలు తాగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ప్యాకెట్ పాలు తాపితే ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. ఇళ్లకు వచ్చి పాలు పోసే వ్యాపారులను అనుమతించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి