కడప జిల్లా పులివెందుల మండలం బొగ్గుడు పల్లికి చెందిన నాగ బాషా, షేక్ నూర్జహాన్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. నాగ బాషా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్ది కాలం నుంచి అతను మద్యానికి బానిసై సంపాదనంతా జల్సాలకు, తాగుడుకు ఖర్చు చేస్తుండేవాడు. భార్య నూర్జహాన్ ఎన్నిసార్లు నచ్చజెప్పినా పెడచెవిన పెట్టాడు.
కరోనా కారణంగా పనిలేక అతను ఇంటి వద్దనే ఉన్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య శనివారం జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. తీవ్ర మనస్థాపానికి గురైన నూర్జహాన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: