ETV Bharat / state

'అధైర్యం వద్దు.. ప్రభుత్వం పంటను కొంటుంది' - పులివెందులలో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి పర్యటన వార్తలు

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని గ్రామాల్లో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి పర్యటించారు. చీనీ రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.

marketing department prinipal secretary madhusudan reddy visit pulivendula constituency in kadapa
చీనీ పంట పరిశీలన
author img

By

Published : May 12, 2020, 7:37 PM IST

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు హార్టికల్చర్​పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చీనీ, అరటి సాగు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పంటల దిగుబడి ఎగుమతులు కాక రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని జిల్లా నాయకులు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

హార్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి.. లింగాల మండలంలో పర్యటించారు. చీనీ, అరటి పంటను పరిశీలించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. పంటను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

తెలుగు లఘుచిత్రానికి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.