కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. నరసాపురం, అక్కలరెడ్డిపల్లె,నరసయ్య కుంట, ముదిరెడ్డిపల్లి చెరువులు గండ్లు పడ్డాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద చేరుతోంది. ఐదేళ్లుగా వర్షాభావంతో బాధ పడుతున్న రైతన్నలు, చెరువులకు పడిన గండ్లను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. గండ్లుపడిన చెరువులకు అడ్డుకట్ట వేసేందుకు నీటిపారుదల శాఖ ఇంజనీరు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీచూడండి.సీమలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు