ETV Bharat / state

మునుల కొండగా ఆ ప్రాంతం చాలా ప్రసిద్ధి అదెక్కడో తెలుసా..?

80 ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఆ మండలంలో చేదబావులు చాలా ఫేమస్​. ఇప్పటికి వేసవి వచ్చిందంటే చాలు ఆ చేదబావి నీరే వారికి ఆధారం. అవును మీరు విన్నదే నిజం. ఆ చేదబావుల వద్ద ఎత్తైన కొండల్లో మునులు తపస్సు చేసేవారట. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో ఆ మండలం అతిపెద్దది.. ఆ ప్రాంతం ఏంటి దానికి అంత ప్రాధాన్యత ఎందుకు? ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వార్త మీరు తప్పక చదవాల్సిందే.

Breaking News
author img

By

Published : Dec 18, 2020, 2:53 PM IST

రాష్ట్రంలోనే విస్తీర్ణంలో ఆ మండలం అతిపెద్దది. చుట్టూ ఎత్తయిన కొండలు.. ఏడు మండలాలు, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి సరిహద్దుగా నిలిచింది. అదే ముదిగుబ్బ మండలం. సుమారు 80ఏళ్ల నాటి కన్యకలగొంది, వెంగమునిస్వామి ఆలయాలు ఈ మండంలంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మునులు తపస్సు చేసేవారని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు. ఇక్కడున్న చేదబావి దగ్గర ఎత్తయిన కొండల్లో ఒకప్పుడు మునులు తపస్సు చేస్తుండేవారని.. దీనిని మునుల కొండగా భక్తితో కొలిచేవారు. అక్కడ గ్రామం ఏర్పడటంతో మునులు కొండ మరుగున పడింది. ప్రస్తుతం చేదబావి సమీపంలో ఇళ్లు కట్టుకుని నివాసాలు ఉండటంతో మునులుగుబ్బగా పేరు మారింది. కాలక్రమేణా జనాభా పెరగడంతోపాటు.. జనం వాడుకలో మునులుగుబ్బ కాస్త మునిగుబ్బ, ముదిగుబ్బగా మారిందంటారు. ఇప్పుడు ఇది పట్టణంగా తయారైంది. చేదబావి దగ్గర ఇళ్లను పాతూరు పేరుతో.. కొత్తగా ఏర్పడిన ఇళ్లను ముదిగుబ్బగా అక్కడి స్థానికులు పిలుస్తున్నారు.

1947 నాటి చేదబావి:

పాతూరులో 73ఏళ్ల నాటి చేదబావి ఇప్పటికీ తాగునీరు అందిస్తోంది. గ్రామం ఏర్పడినప్పుడు తాగునీటికోసం గ్రామస్థులంతా కలిసి 10మట్లు అంటే దాదాపు (60అడుగులు) లోతుకి తవ్వి చేదబావి ఏర్పరుచుకున్నారు. ఎక్కడా తాగునీరు దొరకకపోతే అప్పట్లో తాగడానికి ఈ చేదబావినీరే వాడేవారు. నేటికీ వేసవిలో ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. ఇలాంటివి గ్రామంలో నాలుగు తవ్వగా.. రెండు బావులు ఎండిపోగా ప్రస్తుతం రెండింటిలో నీరున్నాయి.

ఇదీ చదవండి: పెన్నానదిలో ఐదు మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.