కడప జిల్లా శివారులోని ఎర్రగుడిపాడు సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఆ వ్యక్తి వయసు 52 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి