కడప జిల్లా బద్వేలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. కడప పట్టణం తిలక్‌నగర్‌కు చెందిన హరిమంజులకు ఏడు నెలల కిందట వివాహం జరిగింది. రెండు రోజుల కిందట బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో రెండు రోజుల కిందట సంసారం పెట్టారు.
ఇద్దరి మధ్య ఏం వివాదం జరిగిందో కానీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉదయాన్నే కత్తితో పొడిచి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కిరాతకంగా హత్య చేసిన భర్త హరిపై బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: