కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నాడు. ఏ ప్రదేశంలోనైనా హ్యాండిల్ లాక్ చేయని బైక్లు కనిపిస్తే చాకచక్యంగా వాటిని ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతని వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా వాహనాలు నిలిపే సమయంలో లాక్ వేయడం మరవవద్దని జిల్లా ఎస్పీ సూచించారు.
ఇదీ చదవండి: టచ్ ఫోన్కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు