కడప జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద లారీ దగ్ధమైంది. గుజరాత్ నుంచి టైల్స్ లోడుతో కడపకి వెళ్తున్న లారీ.. గువ్వల చెరువు ఘాట్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. లారీ లోని డ్రైవరు క్లీనరు అప్రమత్తమై కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ మంటలు డీజిల్ ట్యాంకు వరకు విస్తరించి డీజిల్ బయటకు రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.లారీ పూర్తిగా దగ్ధం కావడంతో రూ.30 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలియగానే రామాపురం పోలీసులు, లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కడప జిల్లాలో పుర ఎన్నికలపై కలెక్టర్ సమావేశం