లాక్డౌన్ సందర్భంగా కడపలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతమంతా నిర్మానుషంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో 910 సర్వీసులు నిలిపివేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అనుమతి ఇవ్వడం వల్ల నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రజలు బారులు తీరారు. కూరగాయలు షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ భారీగా క్యూ కట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు రాకపోవడం వల్ల దుకాణాదారులు అధిక ధరలకు కూరలు విక్రయించారు.
ఇదీ చదవండి :