కడప జిల్లా మైదుకూరులో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రధాన రహదారిపై పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు బయటకు వెళ్లే వారిని ప్రశ్నిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. 21 రోజుల వరకు లాక్డౌన్ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజిలెన్స్ అధికారి ఉమామహేశ్వర్ తెలిపారు.
జమ్మలమడుగులో..
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ కడపలో నాలుగో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటల నుంచి పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. ఉదయం 5 నుంచి 9 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం సమయాన్ని కేటాయించారు. తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు. కూరగాయల వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కూరగాయల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: