కడప జిల్లా రాజంపేటలోని బీసీ బాలికల సమీకృత వసతి గృహం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఇతర జిల్లాలకు చెందిన వలస కూలీలను ఇక్కడ ఉంచుతున్నారనే అనుమానంతో నిరసన చేపట్టారు. జనావాసాల మధ్య కరోనా అనుమానితులను పెట్టవద్దంటూ వసతి గృహంపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో హాస్టల్ నిర్వాహకురాలు శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ నారాయణరెడ్డి ప్రజలకు నచ్చజెప్పారు. అక్కడ ఎవరినీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. స్థానికులు కొందరు యువకుల్ని వసతిగృహం లోపలికి పంపి ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి..