కడపలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు మూడు గంటల పాటు వర్షం కురుస్తూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని కోర్టు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, మృత్యుంజయ కుంట, నకాష్, ఖలీల్ నగర్, భాగ్యనగర్, భరత్ నగర్ లో నీళ్లు నిలిచాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న కడప నగర ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరట కల్పించింది.
ఇదీ చదవండి: