Kuwait Murder Case: కువైట్‌లో ముగ్గురు వ్యక్తులను హత్య చేశారనే అభియోగాలతో కడపజిల్లాకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఉరిశిక్ష వేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... అతని భార్య స్వాతి కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు.
తన భర్తకు ఏ పాపమూ తెలియదని, మూడు హత్యలతో సంబంధం లేదని ఎస్పీకి వివరించారు. కువైట్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో తాము మాట్లాడుతున్నామని.. ఎస్పీ చెప్పారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన భర్తను కాపాడాలని స్వాతి వేడుకుంటోంది.
ఇదీ చదవండి: