తెలంగాణలో 2023లో షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో పార్టీ అధికారిక ప్రకటన, జెండా ఆవిష్కరణ, పార్టీ ఎజెండా అని ప్రకటిస్తామని కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకురావలనే ఏకైక లక్ష్యంతో షర్మిల ముందుకు సాగుతున్నారని అన్నారు. 2023లో తప్పనిసరిగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: