కడప జిల్లాలో కారుణ్య నియామకం కింద 10 మంది అభ్యర్థులకు కలెక్టర్ సి. హరికిరణ్ తన ఛాంబర్లో పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు.
సయ్యద్ అస్సలాంకు కడప ఎస్పీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఆర్డర్ అందజేశారు. బి. అశోక్ కుమార్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, పి. స్వప్న డీడీ ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్, సీ. భారతి డీడీ ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్, కె. వాసవి జిల్లా ఆడిట్ కార్యాలయంలో జూనియర్ ఆడిటర్, ఎం. జయశాలి జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, పి. మల్లేశ్వరమ్మ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం లో టైపిస్ట్, జె. హరికృష్ణ జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, గణేష్ నాయక్ అట్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్, మహబూబ్ బాషా కడప కలెక్టర్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందిన 10 మంది అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరి విధులు నిర్వహించాలన్నారు.
ఇదీ చూడండి