కడప జిల్లా కాశీనాయన మండలం.. నర్సాపురం గ్రామంలో మహిళలు మద్యం అమ్మకాలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దంటూ ఆందోళనకు దిగారు. మైదుకూరు, బద్వేలు ప్రాంతానికి చెందినవారు తమ గ్రామానికి రావడంపై ఆగ్రహించారు.
జనాలు గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రస్తుతానికి మద్యం దుకాణాలు మూసివేసి అక్కడి నుంచి మందుబాబులను పంపించేశారు.
ఇవీ చదవండి: