ETV Bharat / state

విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు - విద్యుత్ దొంగను అరెస్ట్​ చేసిన కడప విజిలెన్స్ అధికారులు:

కడప జిల్లా రాయచోటిలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తిని విద్యుత్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. పలువురి ఇళ్లలో మీటర్లను ట్యాంపరింగ్​ చేసి బిల్లు తక్కువ వచ్చే విధంగా అతను ఏర్పాట్లు చేసి సుమారు పది లక్షల రూపాయల విద్యుత్​ని అక్రమంగా వినియోగించాడని వెల్లడించారు.

Kadapa vigilance officers arrested the power thief
విద్యుత్ దొంగను అరెస్ట్​ చేసిన విజిలెన్స్ అధికారులు:
author img

By

Published : Dec 18, 2020, 9:44 AM IST

విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తిని కడప విద్యుత్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. రాయచోటికి చెందిన ఆ వ్యక్తికి విద్యుత్తు రంగంలో మంచి అనుభవం ఉంది. దీంతో సుమారు పదిహేను నివాసాల్లోని విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్​ చేసి తక్కువ బిల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాడు. విజిలెన్స్ అధికారులు గ్రామంలో తనిఖీలు చేయగా ట్యాంపరింగ్​ను గుర్తించి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. దీని విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.