తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును కడప జిల్లా నేతలు హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలిశారు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, తెదేపా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి.. ఈ బృందంలో ఉన్నారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో పోరాడి పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు చంద్రబాబు తమను అభినందించారని వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. ఇదే స్ఫూర్తితో పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులకు అధినేత సూచించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: