కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా అమ్ముతున్న కొండేటి సుబ్రమణ్యం, చెన్నూరు మణిలను అరెస్టు చేసి.. నిందితుల నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చిన్నంపల్లి పంచాయతీ, లింగిరెడ్డిపల్లి, అరుంధతీవాడ సమీపంలో జీమాను కుంట వద్ద.. నాటు సారా తయారు చేస్తున్న వర్ల నరసింహులు, వర్ల సుదర్శన్‌లు 500 లీటర్ల బెల్లం ఊటతో పట్టుపడ్డారని తెలిపారు. వర్ల పెంచలయ్య అలియాస్ బుజ్జి అనే నిందితుడు పరారైనట్లు చెప్పారు.
నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు 9440902597 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: