కడప జిల్లా కొండాపురం గండికోట జలాశయంలో ఈ ఏడాది 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్డీవో నాగరాజు తెలిపారు. కొండాపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆర్డీవో... ప్రాజెక్టు నిర్వాసితులకు మే చివరి లోపు పరిహారం అందజేస్తామని తెలిపారు.
తాళ్ల పొద్దుటూరు గ్రామానికి జూన్ నెలలో, ఎర్రగుడి చామలూరు గ్రామాలకు జూలై నెలలో పరిహారం పంపిణీ ప్రక్రియ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో 6 లక్షల 75 వేల పరిహారం పొందిన నిర్వాసితులకు 3 లక్షల 25 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: