వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం కడప జిల్లా బద్వేలు పురపాలకలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్లకు రెండోరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మెుత్తం 170 మందికి ఏడుగురు గైర్హజరు కాగా వారిపై కమిషనర్ కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ తీసుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే ఇక పనెలా చేస్తారని వాలంటీర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారిని నిర్మొహమాటం లేకుండా విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నవరత్నాలు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆయన వివరించారు. ఇది చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత