వైకాపా ప్రభుత్వం దళితులను బతకనివ్వటం లేదని కడప తెదేపా ఇన్ఛార్జ్ అమీర్ బాబు మివర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. కడప తెదేపా కార్యాలయంలో నిరసనకు దిగారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఎస్సీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ డాక్టర్ మెుదలుకొని.. ఎంతోమంది ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి.. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వారిపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. జగన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
ఇదీ చదవండి: కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం