సెప్టెంబరు 1, 2 తేదీల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ ఆదేశాల మేరకు కడప సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ ఇతర అధికారులతో కలిసి జేసీ సాయికాంత్ వర్మ ఇడుపులపాయలో పర్యటించారు. అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సీఎం పర్యటన విధుల్లో పాల్గొనే వారంతా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మాస్కులు లేనివారిని, భౌతిక దూరం పాటించని వారిని అనుమతించడం జరగదన్నారు. హెలిప్యాడ్ వద్ద బారికేడింగ్, బందోబస్తు, వీఐపీలకు షామియానా, ముఖ్యమంత్రి ఇంటి వద్ద బందోబస్తు, శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, మాస్కుల ఏర్పాటు, వైద్య బృందం, నిరంతరాయ విద్యుత్ సరఫరా... అలాగే వైఎస్ఆర్ ఘాట్ వద్ద సుందరీకరణ, మీడియా పాయింట్ తదితరాలపై సమీక్షించారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఇదీ చదవండి :