Jammalamadugu MLA Sudhir Reddy: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నియోజకవర్గంలో అసమ్మతి సెగ తాకింది. చిన్నదండ్లూరు సర్పంచ్ రాముడు పార్టీని నమ్ముకుని డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచ్‌గా గెలిచినా తనను ఎమ్మెల్యే పక్కన పెట్టారని ఆవేదన చెందారు. పార్టీ కోసం పనిచేసిన తనను పక్కనపెట్టి తనకు వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ వారితో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. మట్టి తరలింపును అడ్డుకున్న వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని రాముడు తెలిపాడు. ఈ మేరకు ఎమ్మెల్యే అసమ్మతి వర్గం గంగవరం శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు గంగవరం శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కార్యకర్తలను నమ్మించి గెలిచారని.. గెలిచిన అనంతరం తమను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.
చిన్నదండ్లూరు సర్పంచ్ రాముడు మాట్లాడుతూ.. తాను పార్టీని నమ్ముకుని డబ్బులు ఖర్చుపెట్టి సర్పంచ్‌గా గెలిచినా.. తనను ఎమ్మెల్యే పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తనను పక్కనపెట్టి తమకు వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ నేతలకు ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని రాముడు ఆరోపించారు. ఇదే అంశంపై ప్రశ్నించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని సర్పంచ్ రాముడు వెల్లడించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యే పక్కన పెట్టారని ఆరోపించారు. తన స్వలాభం కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమను పక్కన పెట్టారని వైసీపీ నాయకులు వాపోయారు. సుధీర్‌రెడ్డిని కాకుండా పులివెందుల నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా సహకరిస్తామని వెల్లడించారు. లేదంటే గంగవరం శేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరిస్తామని పేర్కొన్నారు. వేరే వారు ఎవరు పోటీ వచ్చినా తాము సహకరించే పరిస్థితి లేదని వైసీపీ నాయకులు వెల్లడించారు.
ఇవీ చదవండి: