ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఈ నెల 23, 24, 25తేదీల్లో పర్యటించనున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన, రాయచోటి పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పులివెందుల డెవలప్మెంట్ అధికారి అనిల్ కుమార్రెడ్డి తెలిపారు. పులివెందులలో భారీ ఎత్తిపోతల పథకాల ఆవిష్కరణ చేస్తారు. అలాగే జిల్లావ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. వాటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనకు జిల్లాలో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ కుమార్ రెడ్డి వివరించారు.
ఇదీ చూడండి