కడప జిల్లా రాయచోటిలో జగనన్న చేదోడు కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యాభివృద్ధికి అమ్మఒడి, గోరుముద్ద వసతి దీవెన వంటి పథకాలే కాకుండా రైతులు ఇతర చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఏటా రూ 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కిందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా చేతివృత్తుల వారికి రూ 1.49 కోట్ల మెగా చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: