కడప జిల్లా ప్రొద్దుటూరులో బుల్లితెర వ్యాఖ్యాత, జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్ సందడి చేశారు. పట్టణంలోని వినాయక వస్త్ర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, జ్యోతి ప్రజ్వలన చేశారు. రష్మీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం రష్మీ డాన్స్ చేసి యువకులను, అభిమానులను ఉత్సహపరిచారు.
కార్యక్రమానికి రావటం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు.
ఇదీ చదవండి: పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' ప్రారంభం