ETV Bharat / state

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.. 'రూ.8 లక్షల విలువైన కెమెరాలు స్వాధీనం'

INTERSTATE ROBBERS AEERST: రాజస్థాన్​కు చెందిన ఇద్దరు యువకులు యూట్యూబ్​లో చూసి కడపలోని ఓ షాప్ షట్టర్​ను పగులగొట్టి విలువైన కెమెరాలను చోరీ చేశారు. వెంటనే రాజస్థాన్​కు పారిపోయిన ఈ అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విలువైన 18 కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, కొన్ని విలువైన కెమెరా లెన్స్​లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Interstate thieves arrested news
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
author img

By

Published : Mar 21, 2023, 11:54 AM IST

Updated : Mar 21, 2023, 1:12 PM IST

INTERSTATE ROBBERS AEERST: యూ ట్యూబ్​లో చూసి కడప ఎన్టీఆర్ కూడలి వద్ద ఓ షాపు షట్టర్​ను పగులగొట్టిన కెమెరాలను దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కెమెరాలను వారు చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను రాజస్థాన్​లో అరెస్టు చేశారు. వారి నుంచి 18 కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, కొన్ని విలువైన కెమెరా లెన్స్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాజస్థాన్​కు చెందిన కమలేష్ కుమార్, ప్రవీణ్ కుమార్​లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అరెస్టయిన ఇద్దరు నిందితులను వైయస్సార్ జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్.. మీడియా ఎదుట హాజరుపరిచారు.

పోలీసుల సమాచారం ప్రకారం..: రాజస్థాన్​కు చెందిన కమలేష్ కుమార్, ప్రవీణ్​కుమార్ ఇద్దరు కడప వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కమలేష్ కుమార్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిపై అతడికి ఆసక్తి ఉండేది. ఖరీదైన కెమెరాలు కొనలేక ఆ వృత్తిని వదిలేసి కడపలో ఒక ఐరన్ దుకాణంలో పనిచేసేవాడు. కడప ఎన్టీఆర్ కూడలి వద్ద స్మార్ట్ కెమెరాల దుకాణంలో ఉన్న కెమెరాలు చూసి ఎలాగైనా వాటిని ఎలాగైనా దొంగలించాలని పథకం వేశాడు.

తనతో పాటు ప్రవీణ్ కుమార్​కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దొంగతనం ఎలా చేయాలో తెలియక యూట్యూబ్​లో సెర్చ్ చేసి షట్టర్​ను పగులగొట్టే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఈ నెల 16వ తేదీన వీరిద్దరూ కలిసి ఇనుప కడ్డీతో కెమెరా దుకాణం షెట్టర్​ను పగలగొట్టి దుకాణంలోకి వెళ్ళి చోరీకి పాల్పడ్డారు. అక్కడ ఉన్న 18 కెమెరాలు, రెండు జోన్ కెమెరాలు, మూడు ఖరీదైన లెన్సులు మొత్తం ఎనిమిది లక్షలు విలువ చేసే సామాగ్రిని దొంగలించి అక్కడి నుంచి రైల్వే స్టేషన్​కు వెళ్లి రాజస్థాన్​కు పారిపోయారు.

ఈ చోరీపై సమాచారం అందిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. వెంటనే హుటాహుటిన పోలీసుల ప్రత్యేక బృందం రాజస్థాన్​కు వెళ్లి కమలేష్ కుమార్, ప్రవీణ్ కుమార్​లను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసే కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా జీవనోపాధి కోసం బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది యువత కడపకు వస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన కడప ఒకటో పట్టణ పోలీసులను అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

"కడప వన్ టౌన్​కు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒక కెమెరా షాప్ షట్టర్​ తెరిచి దొంగతనం చేసి వెంటనే రాజస్థాన్​కు ట్రైన్​లో వెళ్లి పోయారు. వీరు యూట్యూబ్​లో సెర్చ్ చేసి షట్టర్ ఎలా పగులగొట్టాలో తెలుసుకున్నారు. అనంతరం దొంగతనానికి పాల్పడి పారిపోయిన వారిని అరెస్టు చేశాము. వారి వద్ద నుంచి 18 కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, కొన్ని విలువైన కెమెరా లెన్స్​లతో పాటు రెండు సెల్​ఫోన్స్​ను స్వాధీనం చేసుకున్నాము." - అన్బురాజన్, కడప జిల్లా పోలీసు అధికారి

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

ఇవీ చదవండి:

Last Updated : Mar 21, 2023, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.