ETV Bharat / state

నకిలీ వేలిముద్రలతో డబ్బు స్వాహా.. అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లు అరెస్టు - CYBER FRAUD

Cyber Crime With Fake Fingerprints: డబ్బులు ఊరికే ఎవరికీ రావు.. ప్రతి ఒక్కరూ కష్టించి పని చేసి.. సంపాదించిన సొమ్మును బ్యాంక్​లో దాచుకుంటారు. కానీ సైబర్ నేరగాళ్లు ఇందుకు విరుద్దం.. సాంకేతికతో అందరినీ మోసం చేస్తూ డబ్బు దోచేస్తున్నారు. అలాంటి ఘటనే వైఎస్సార్​ జిల్లాలో జరిగింది. నకిలీ వేలిముద్రలు తయారుచేసి.. బ్యాంకుల్లో నగదును విత్ డ్రా చేసే అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

సైబర్
cyber
author img

By

Published : Feb 10, 2023, 7:44 PM IST

Cyber Crime With Fake Fingerprints : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. వారు రోజుకొక పద్దతిలో అమాయకుల దగ్గర నుంచి వారికే తెలియకుండా బురుడి కొట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వైయస్‌ఆర్‌ జిల్లా పోలీసులకు చిక్కారు. పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు.

ఆధార్‌ ఎనేబుల్‌ సిస్టం: వైయస్‌ఆర్‌ జిల్లా కడప ఫక్కీర్‌పల్లెకు చెందిన సనాపు రాజశేఖర్‌రెడ్డికి కెనరా, యూనియన్‌ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. 2022 జులై 21 నుంచి 29వ తేదీ వరకు అతనికి తెలియకుండా ఎలాంటి ఓటీపీలు, లింక్‌లు రాకుండానే రూ.89,550 నగదు డ్రా అయ్యింది. బాధితుడు కడప చిన్నచౌకు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడానికి ఏఎస్పీ తుషార్‌ డూడిని నియమించాం. ఆధార్‌ ఎనేబుల్‌ సిస్టం (ఏఈపీఎస్‌) ద్వారా బాధితుని నకిలీ వేలిముద్రలను సృష్టించి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌లోని బయోమెట్రిక్‌ డివైస్‌ స్కానర్‌లో ఖాతాదారుని ఆధార్‌కార్డుకు లింకు ఉన్న బ్యాంకు ఖాతా నుంచి రోజుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.89,550 నగదును డ్రా చేశారు. ఏఈపీఎస్‌ ద్వారానే సైబర్‌ నేరానికి పాల్పడినట్లు తెలుసుకున్నాం.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరగాళ్ల సమాచారం: ఇలాంటి నేరాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘోరక్‌పూర్‌ జిల్లాలో చేస్తారని తెలిసింది. చిన్నచౌకు సీఐ శ్రీరాం శ్రీనివాస్‌, ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి, సైబర్‌ క్రైం ఠాణా బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరగాళ్ల సమాచారం తెలుసుకున్నారు. ఘోరక్‌పూర్‌ జిల్లాకు చెందిన శేషనాథ్‌శర్మను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితులు వికాష్‌ అలియాస్‌ విక్కీ, అక్షయయాదవ్‌ సహకారంతో ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన 440 మంది ఆధార్‌ సమాచారాన్ని దొంగచాటుగా సేకరించి, వాటి ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. ఆ వేలి ముద్రలను ఉపయోగించి ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా నుంచి నగదు డ్రా చేసినట్లు అంగీకరించారు.

శేషనాథ్‌శర్మను అరెస్టు చేసి అతని నుంచి బయోమెట్రిక్‌, కంటప్యూటర్‌ను స్వాధీన పరుచుకున్నాం. వికాష్‌ అలియాస్‌ విక్కీ, అక్షయయాదవ్‌ పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నాం. ఇలాంటి మోసానికి గురైన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.