రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కడప జిల్లాలో.. 94 పరీక్ష కేంద్రాల్లో సుమారు 49వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. మాస్కులు ధరించిన విద్యార్థులను మాత్రమే సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. శ్రీకాకుళం జిల్లాలో 113 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ.. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ముందుగానే హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.
ఇదీ చదవండి:
Saidabad Rape Case: సైదాబాద్ హత్యాచారం కేసును నేరుగా పర్యవేక్షిస్తున్న డీజీపీ