ETV Bharat / state

VIVEKA CASE: వైఎస్ వివేకా హత్య కేసులో.. కొనసాగుతున్న విచారణ! - kadapa crime

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(ys viveka murder case)లో సీబీఐ(cbi) విచారణ ముమ్మరంగా సాగుతోంది. పులివెందుల వాసులు రవి, డ్రైవర్ గోవర్ధన్​ను అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా తిరిగిన వాహనాల గురించి సీబీఐ అధికారులు ఆరా తీశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

author img

By

Published : Jun 11, 2021, 7:51 PM IST

Updated : Jun 12, 2021, 4:58 AM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(ys viveka) హత్యకేసులో సీబీఐ నాలుగో దఫా విచారణ ముమ్మరంగా సాగుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరుసగా 5 రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ... కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వివేకా ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లోకి దస్తగిరిని తీసుకెళ్లి పరిశీలించారు. హత్య జరిగిన రోజు దుండగులు అక్కడేమైనా నక్కి ఉన్నారా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. దస్తగిరితో కలిపి పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను కడపలో 8 గంటల పాటు విచారణ చేశారు. ఇక సీబీఐ అధికారులు అడిగిన మేరకు... రవాణా శాఖ సిబ్బంది కొన్ని వాహనాల వివరాలను సీబీఐకి అందజేశారు.

2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్య(ys viveka murder) జరిగింది. 14వ తేదీ అర్ధరాత్రి వివేకా ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన అనుమానాస్పద వాహనాల వివరాలను రవాణ శాఖ అందించడంతో... శుక్రవారం మధ్యాహ్నం రెండు సీబీఐ బృందాలు కడప నుంచి పులివెందుల వెళ్లాయి. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనం తిప్పిన యజమానులు అరికటవేముల రవి అలియాస్ మట్కారవితో పాటు డ్రైవర్ గోవర్ధన్​ను సీబీఐ(cbi) ప్రశ్నించింది. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో ఇద్దరినీ ప్రశ్నించారు. మట్కారవిపై పోలీస్ స్టేషన్​లో రౌడీషీట్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆరోజు ఇన్నోవా వాహనం ఎక్కడెక్కడ వెళ్లిందనే వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. ఎపుడు విచారణకు పిలిచినా రావాలని మట్కారవి, గోవర్ధన్​లను అధికారులు ఆదేశించారు.

ఇదే సందర్భంలో పులివెందులలో వైకాపా కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ఇంటిని సీబీఐ బృందం పరిశీలించింది. సునీల్ కుమార్ యాదవ్ తోపాటు అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇద్దరు అన్నదమ్ములు కావడం విశేషం. సునీల్​ను ను గతంలోనే దిల్లీకి తీసుకెళ్లి సీబీఐ ప్రశ్నించింది. సునీల్ అనే వ్యక్తి వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఫలితంగా ఇద్దరు సోదరుల నుంచి హత్యకేసుపై సీబీఐ కీలక సమాచారం రాబట్టిందనే ప్రచారం సాగుతోంది. వివేకా హత్య కేసులో పాత్రధారులపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీబీఐ... సాక్ష్యాలు, ఆధారాల సేకరణలో పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అసలైన హంతకులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. శనివారం కూడా మరికొందరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యే వీలుంది.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతోంది: ఏకే సింఘాల్‌

Last Updated : Jun 12, 2021, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.