కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప, కర్నూలు జిల్లాలో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లాలోని చాపాడు సమీప సీతారామపురం వద్ద నదిలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దిగువనే ఉన్న పెన్నానదిలోకి చేరుతోంది. గతేడాదిలాగానే ఈ ఏడాది జులై నెలలో నదిలో నీటి ప్రవాహం కనిపించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నది పరివాహక ప్రాంతంలో భూగర్భజలాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా బోరుబావుల ద్వారా పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. కానీ కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా సెప్టెంబరు , అక్టోబర్లో భారీ వరదలు వస్తాయి. అలాంటిది జూలైలోనే కుందూ నదికి వరద ప్రారంభమైంది. పెద్దముడియం మండలం నెమల్లదిన్నె వద్ద వరద నీరు వంతెనపై పారుతోంది. సుమారు 17 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని సమాచారం. ఈ నది మరింత ఉద్ధృతంగా పారితే చిన్న ముడియం, బలపన గూడూరు, పెద్దముడియం, తదితర గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయి. గత ఏడాది అక్టోబర్లో భారీస్థాయి వరద నీరు వాగుపై ప్రవహించడంతో చాల రోజుల వరకు రాకపోకలు ఆగిపోయాయి.
ఇదీ చూడండి. కరోనా ప్రభావంతో ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలకు బ్రేకులు