ETV Bharat / state

పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం... బాలిక మృతి - in kadapa road accident one girl died and 11 people were injured

పుణ్య క్షేత్రాలను దర్శించుకుని వస్తున్న వారిని విషాదం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం... కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా 11 మందికి గాయాలయ్యాయి.

in kadapa road accident one girl died and 11 people were injured
కడపలో రోడ్డు ప్రమాదం..బాలిక మృతి, 11 మందికి తీవ్రగాయాలు
author img

By

Published : Dec 27, 2019, 6:38 AM IST

కడపలో రోడ్డు ప్రమాదం..బాలిక మృతి, 11 మందికి తీవ్రగాయాలు

కడప జిల్లా రాజంపేట మండలం చోప్పావారిపల్లె వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో, కారు ఢీకొన్న ఘటనలో చిన్నారి మృతి చెందింది. 11 మందికి గాయాలయ్యాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరికి చెందిన 14 మంది తిరుమలేశుని దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తిలోని ఆలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. రాజంపేట మండలం చొప్పావారి పల్లె వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్నబొలేరో వాహనాన్ని... ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందన అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స కోసం వారిని తిరుపతికి తరలించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం... ఊరూరా నిరసన స్వరం

Intro:Ap_cdp_46_27_road pramadam_okaru mruthi_11 mandiki gaayalu_Av_Ap10043
k.veerachari, 9948047582
కుటుంబ సమేతంగా తిరుమలేశుని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా రాజంపేట మండలం చోప్పావారిపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి కి చెందిన 14 మంది తిరుమలేశుని దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తిలో పరమేశ్వరుని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు రాజంపేట మండలం చొప్పావారి పల్లె వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో చందన అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, నరసింహులు ఆస్పత్రికి వచ్చారు. బాధితులతో మాట్లాడి తిరుపతికి పంపించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యాధికారి అనిల్, వైద్య సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం కొంతమందిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

Body:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 11 మందికి గాయాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.