ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా ఉంటూ గ్రామ వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించాలని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ కోరారు. రాజంపేట పురపాలక కార్యాలయంలో పట్టణ గ్రామ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని మేడా తెలిపారు.
ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటరీని నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే సీఎం లక్ష్యమని ఎమ్మెల్యే మల్లికార్జున్ తెలిపారు. ఒక క్రమశిక్షణతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని మేడా సూచించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, పురపాలక కమిషనర్ శ్రీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇది చూడండి: ఆపరేషన్ కశ్మీర్: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం!