కడప జిల్లా నందలూరు మండలం ఈడిగపల్లిలో సర్వే నెంబర్ 197లో 81.02 సెంట్ల భూమి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిపై అక్రమార్కులు కన్నేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కులను అడ్డుకున్నామని.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అలానే జరుగుతోందని అంటున్నారు.
నాటి తెదేపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తమ నివాసాలకు సమీపంలోని భూములను తమకే అప్పగిస్తూ.. రూ. 12 లక్షలు ఖర్చు పెట్టించి కంచె వేయించారని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే వైకాపాలో చేరారని.. ఇప్పుడతని అనుచరులు ఈ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ జీవనాధారం అయిన పశువుల మేత కోసం కాపాడుకుంటూ వస్తున్న కొండ ప్రాంతాన్ని ఆక్రమిస్తే తామెలా బతకాలంటూ వాపోతున్నారు.
ఈ విషయంపై.. అధికారులకు ఫిర్యాదు చేసినా... స్పందించడం లేదని అంటున్నారు. తమకు అన్యాయం చేయొద్దని నాయకులకు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూములను కాపాడాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: