కడప జిల్లా మైదుకూరులో నిషేధిత పొగాకు ఉత్పత్తులతో వెళుతున్న మినీ ట్రక్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు లక్షల విలువైన సరుకుతో పాటు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఈ సరుకు వస్తుందన్న ముందస్తూ సమాచారంతో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులు బ్రహ్మంగారిమఠానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దీని వెనుక ఇంకా ఏవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి