కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు సీఐ సప్తగిరి బాబు, ఏవో శివశంకర్‌రెడ్డి దాడులు చేశారు. పట్టణంలోని సూర్య ట్రేడర్స్‌లో తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందు అమ్ముతున్నట్లు గుర్తించారు. 50, 900 రూపాయలు విలువచేసే 436 గడ్డి ముందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని వినోద్ కుమార్, కర్నూలు జిల్లా అవుకుకు చెందిన డీలర్ నాగరాజులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రెండో పట్టణ ఠాణాలో అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి