కడప జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న ట్రిపుల్ ఐటీలో.. ఒంగోలు క్యాంపస్ పూర్వ విద్యార్థి శివ గోపాల్ రెడ్డి.. ఐఏఎస్ సాధించి తొలిసారిగా ట్రిపుల్ ఐటీకి వచ్చారు. ఇందులో భాగంగా... విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తను సాధించిన విజయాలు, అనుభవాలు గురించి వారికి తెలియజేశారు.
తాను ఐఏఎస్ సాధించటంలో తల్లిదండ్రుల కృషితో పాటు ఆర్జీయూకేటీ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రజా సమస్యలు తీర్చగలిగితే అదే చాలని చెప్పారు. అలాగే ట్రిపుల్ ఐటీలో చదివి మంచి ఉద్యోగాలు సాధించిన సీనియర్లు అందరం కలిసి జూనియర్లకు అవగాహన కల్పించటం అనందంగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:
'సూట్ కేసు కంపెనీల ద్వారా తితిదే నిధులను కాజేయాలని చూస్తున్నారు'