కడప జిల్లాలోని కందూనదిలో రోజురోజుకు నీటి ప్రవాహం పెరుగుతోంది. జిల్లాలోని చాపాడు మండలం సీతారామపురం వద్ద దిగువ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రం 17వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ఈరోజు ఉదయం 26,500 క్యూసెక్కులకు పెరిగింది. కేవలం 12 గంటల వ్యవధిలో 9,500 క్యూసెక్కుల ప్రవాహం నదిలో పెరిగినట్టు అధికారులు గుర్తించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీటితో పాటు కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు నదిలోకి చేరుతుంది.
ఇదీ చూడండి: ఉత్తరాదిన వరద గుప్పిట్లోనే పలు రాష్ట్రాలు