కడప జిల్లా ప్రొద్దుటూరుని వైఎంఆర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. నేషనల్ ఇన్సూరెన్స్ సీనియర్ అసిస్టెంట్ మధుకుమార్ బాబు ఇంట్లో తెల్లవారుజామున దొంగతనం చేశారు. దాదాపు 55 తులాల బంగారాన్ని అపహరించుకుపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అర్ధరాత్రి మధుకుమార్ కూతురికి పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఇదే సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ద్వారా సంఘటనాస్థలంలో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి