జులై 8న పండగ వాతావరణంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న చెప్పారు. గురువారం మధ్యాహ్నం కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో ఇప్పటికే పేదల జాబితాను సిద్ధం చేశామన్నారు. తన పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు, 16 మండలాలు ఉన్నాయని వివరించారు. వాటిలో 13,210 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 28,814 అర్హుల జాబితా సిద్ధం చేశామన్నారు. అర్హులుగా ఉండి ఇంటి స్థలాలకు సంబంధించి జాబితాలో పేర్లు లేకపోతే… ఈ నెల 23వ తేదీలోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండీ... ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల
'పండగ వాతావరణంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ’
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకీ ఇప్పటికే పేదల జాబితాను సిద్ధం చేశామన్నారు ఆర్డీవో నాగన్న. జులై 8న పండగ వాతావరణంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని చెప్పారు.