ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం - ఏపీలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలందిస్తున్నారని ప్రముఖులు కొనియాడారు. విపత్కర సమయాల్లో వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు.

home guards foundation day
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
author img

By

Published : Dec 6, 2020, 3:21 PM IST

Updated : Dec 6, 2020, 7:17 PM IST

పోలీసులతో పాటు హోంగార్డులు సమానమైన విధులు నిర్వహిస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కొనియాడారు. కరోనా సమయంలో, నివర్ తుపానులో హోంగార్డులు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కడప పోలీసు మైదానంలో 58వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత ఉపముఖ్యమంత్రి హోంగార్డుల పరేడ్​ను తిలకించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంగార్డుల జీతాన్ని రూ. 21వేలకు పెంచామని తెలిపారు.

కృష్ణా జిల్లాలో...

పోలీసు శాఖలో హోంగార్డ్స్ వాలంటరీగా విశిష్ట సేవలందిస్తున్నారని విజయవాడ డీసీపీ విక్రాంత్ పాటిల్ అన్నారు. విజయవాడ ఏఆర్ మైదానంలో జరిగిన 57వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1946లో బాంబే ప్రెసిడెన్సీలో మొట్టమొదట హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభమైందని.. రాష్ట్రంలో 1963లో అమలు చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఉన్న అన్ని విభాగాల్లో హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని డీసీపి అన్నారు. పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని కొనియాడారు. ఏఆర్ మైదానంలో పెరేడ్ నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లాలో హోంగార్డు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని శాఖల్లో హోంగార్డులు పనిచేస్తున్నారని.. పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. జిల్లాలో మొత్తం 739 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరులో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో మెరుగైన సేవలందించిన హోంగార్డులకు మెమెంటోలు అందజేశారు.

అనంతపురం జిల్లాలో..

పోలీసు శాఖలో హోంగార్డుల విధులు కీలకంగా మారాయని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు అన్నారు. అనంతపురంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డుల ఆవిర్బావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన 25 మంది హోంగార్డులకు మొమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఇవీ చదవండి:

అంతు చిక్కని పరిస్థితులు.. ఇంకా నమోదవుతున్న అస్వస్థత కేసులు

Last Updated : Dec 6, 2020, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.