నివర్ తుపాన్ ప్రభావంతో కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం పరవళ్లు తొక్కుతోంది. శేషాచల అడవుల నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఈ నీరంతా రాయచోటి ప్రాంతంలోని మండవ్య ప్రాజెక్టు, సుండుపల్లిలోని పింఛా ప్రాజెక్టుకు చేరుతోంది. అక్కడా ప్రాజెక్టులు నిండడంతో చెయ్యేరులోకి వదిలేశారు. ఇలా వదిలిన వరదనీరు రాజంపేట మండలంలోని బాధనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయంలోకి చేరింది. అన్నమయ్య ప్రాజెక్టు సామర్ధ్యం కేవలం 2.24 టీఎంసీ మాత్రమే. ప్రాజెక్టు పరిస్థితి బాగలేకపోవడంతో ప్రాజెక్టు అధికారులు ఉన్న 5 గేట్లను ఎత్తివేశారు. ఈ నీటి ఉద్ధృతికి ప్రాజెక్టు గేట్లకు అనుసంధానంగా ఉన్న టైబీమ్లు కాసింత వరిగాయి. ఇప్పుడు గేట్లను కిందకు దింపాలంటే టై బీమ్‌లు కిందకు దిగుతాయో లేదో అని అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ టై బీమ్‌లు దిగినా మరోమారు వరదనీరు చేరితే గేట్లు తెరవడానికి అవకాశం ఉంటుందా... అనేదానిపై అధికారులు సమాలోచనల్లో ఉన్నారు. ఇదిలావుంటే అన్నమయ్య జలాశయం నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో దిగువప్రాంతాల్లో ముంపు పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి:
పరవళ్లు తొక్కుతున్న అన్నమయ్య జలాశయం - అన్నమయ్య జలాశయంలోకి భారీగా వరద నీరు
నివర్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు... కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 2.24 టీఎంసీ మాత్రమే. అయితే ప్రాజెక్టు పరిస్థితి బాగాలేక అధికారులు 5గేట్లను ఎత్తివేయగా.. గేట్లకు అనుసంధానంగా ఉన్న టైబీమ్లు కాసింత వరిగాయి. జలాశయం నుంచి 2లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో దిగువ ప్రాంతాల్లో ముంపు పరిస్థితి ఏర్పడింది.