కడప జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పదిరోజుల కిందట కురిసిన వర్షానికి బుగ్గవంకలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి